ఇండియన్ ప్రీమియర్ లీగ్ తాజా సీజన్‌లో స్టేడియంలో కనిపించిన ఓ యువతి ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. మ్యాచ్ సందర్భంగా కెమెరా ఫోకస్ అయిన వెంటనే ఆమె ఫోటోలు, వీడియోలు విస్తృతంగా వైరల్ అవుతున్నాయి. ఆ యువతి పేరు కశ్మీరా పరదేశి. ఆమెను చూసిన నెటిజన్లు వెంటనే ఆమె ఎవరు, ఏంటి బ్యాక్‌గ్రౌండ్ అని వెతకడం ప్రారంభించారు.

కశ్మీరా పరదేశి సినీ రంగానికి చెందినవారిగా గుర్తిస్తున్నారు. కొన్ని చిత్రాలు, ప్రకటనల ద్వారా ఆమెకు ఇప్పటికే పరిచయం ఏర్పడింది. అయితే ఐపీఎల్ మ్యాచ్‌లో కనిపించడంతో ఆమెకు ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు లభించింది. స్టేడియంలో ఆమె ఉత్సాహంగా మ్యాచ్‌ను వీక్షిస్తున్న దృశ్యాలు టెలివిజన్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో విస్తృతంగా ప్రసారం అయ్యాయి.

కశ్మీరా పరదేశి ముంబై ఇండియన్స్ యువ క్రికెటర్ నేహల్ వాధేరాతో సన్నిహిత సంబంధం ఉందని సోషల్ మీడియాలో కొందరు వినిపిస్తున్న ఊహాగానాలు మరింత చర్చకు దారితీశాయి. అయితే ఈ విషయంపై అధికారికంగా ఎటువంటి ధృవీకరణ వెలువడలేదు. మ్యాచ్ అనంతరం కూడా నెటిజన్లు ఆమెపై అనేక పోస్టులు, మీమ్స్ పెడుతూ చర్చను కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ వేదికగా మరోసారి క్రికెట్‌తో పాటు స్టేడియంలో కనిపించే అభిమానులే వార్తల్లో నిలుస్తున్న దృశ్యం ఇది.

Source: news18