రాబోయే చిత్రం ‘డకాయిట్’లో నటి మృణాల్ ఠాకూర్ పోషిస్తున్న సరస్వతి పాత్రపై సినిమా వర్గాల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ప్రేమకథలు, కుటుంబ కథాంశాల చిత్రాల్లోనే ఎక్కువగా కనిపించిన మృణాల్, ఈసారి దొంగల ప్రపంచం నేపథ్యంగా సాగే గాఢమైన కథలో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ పాత్ర తనను పూర్తిగా కొత్త కోణంలో చూపించబోతోందని, ప్రేక్షకులు ఇప్పటివరకు చూడని మృణాల్‌ను ఈ సినిమాలో చూడబోతున్నారని ఆమె ఇంటర్వ్యూలో వెల్లడించారు.
సరస్వతి పాత్ర గురించి మాట్లాడుతూ మృణాల్, ఈ పాత్రలో భావోద్వేగాలు, అంతర్మథనం, ధైర్యం సమంగా మిళితమై ఉంటాయని చెప్పింది. సాధారణంగా తెరపై కనిపించే సాంప్రదాయ మహిళా పాత్రల కంటే, సరస్వతి చాలా బలమైన మనస్తత్వం కలిగిన మహిళగా చిత్రీకరించబడిందని ఆమె తెలిపింది. కథలో కీలక మలుపులు, భావోద్వేగ ఘట్టాల్లో సరస్వతి పాత్రే ప్రధానంగా నడిపించే శక్తిగా నిలుస్తుందని చెప్పింది.
దొంగల నేపథ్యంలో సాగే ఈ కథలో మహిళా పాత్రను ఇంత బలంగా రాసిన తీరు తనను బాగా ఆకట్టుకుందని మృణాల్ చెప్పింది. పాత్ర కోసం తాను శారీరకంగా, మానసికంగా ప్రత్యేకంగా సిద్ధమైందని, పలువురు నిజజీవిత మహిళల కథలు చదివి, వారి అనుభవాలు అధ్యయనం చేసి సరస్వతిని అర్థం చేసుకున్నానని వివరించింది. ఈ చిత్రంతో ప్రేక్షకుల అంచనాలను మించి తన నటన నిలుస్తుందని, సరస్వతి పాత్ర తన కెరీర్‌లో ఒక మలుపుగా నిలవబోతుందనే నమ్మకం వ్యక్తం చేసింది.
Source: telugu123


